కాగజ్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా

సిర్పూర్ నియోజకవర్గం కాగజ్‌నగర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరించి, ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతాన్ని నాయకులు, కార్యకర్తలు ఆలపించారు. అనంతరం ప్రాణహిత నిలయం వద్ద కూడా జెండా ఎగురవేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
