కాగజ్‌నగర్ మున్సిపల్ సాధారణ సమావేశంలో, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సరఫరా సమస్యలు, అసంపూర్తిగా ఉన్న ఇంటర్ కనెక్షన్ పనులు, ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన మురుగుపై వైస్ చైర్‌పర్సన్, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి నిరంతర నీటి సరఫరా అందించాలని, డిసిల్టింగ్ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి మురుగునీటి కాలువలను శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ పనులు సకాలంలో పూర్తి చేయకపోతే వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.