నదిమాబాద్‌లో ఘనంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు

485చూసినవారు
నదిమాబాద్‌లో ఘనంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలంలోని నదిమాబాద్ గ్రామంలోని మహాబోధి బుద్ధ విహార్‌లో గ్రామ ఉపాసకులు బుద్ధ పౌర్ణమిని ఘనంగా శుక్రవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా భగవాన్ తథాగత్ గౌతమ బుద్ధుని 2780వ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. అంబేద్కర్ సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తెర్ల ఆత్మారాం ముఖ్య అతిథిగా హాజరై పంచశీల్ జెండాను ఎగరేసి, గౌతమబుద్ధుడు లోకానికి శాంతి మార్గాన్ని బోధించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ ఉపాసికలు, ఉపాసకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్