అక్రమ ఇసుక తరలింపు.. నలుగురిపై కేసు నమోదు

4చూసినవారు
అక్రమ ఇసుక తరలింపు.. నలుగురిపై కేసు నమోదు
కొమరంభీం జిల్లా, సిర్పూర్‌(టి)లో శుక్రవారం అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. పెద్దబండ ఎక్స్‌రోడ్‌ వద్ద వాహనాల తనిఖీల్లో పీరాపూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వైపు వెళ్తున్న లారీలో అక్రమ ఇసుక రవాణాను గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌తో పాటు యజమాని అబ్దుల్‌ మజీద్‌ఖాన్‌, అసద్‌, సతీష్‌లపై కేసు నమోదు చేశారు. మండలంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సాగర్‌ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్