ఛలో కొండగట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జనసేన నేతలు

2చూసినవారు
ఛలో కొండగట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జనసేన నేతలు
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న సన్నిధికి రానున్న నేపథ్యంలో, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. సిర్పూర్ నియోజకవర్గం కాగజ్‌నగర్ పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి మందిరంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ పిలుపు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా, కొండగట్టులో 96 సత్రం గదుల నిర్మాణానికి రూ. 35.19 కోట్లతో భూమి పూజ నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్