కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీపీఎం జిల్లా కమిటీ స్వాగతం పలికింది. జిల్లా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ, ప్రకృతి సంపదలు, సాగునీటి వనరులున్నా అభివృద్ధిలో వెనుకబాటుతనం కొనసాగుతోందని పేర్కొంది. అసంపూర్తి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకు
ఉద్యోగాలు, వైద్యుల ఖాళీల భర్తీతో మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేసింది.