కౌటాలలో సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

0చూసినవారు
కౌటాలలో సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) తన 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కౌటాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట శనివారం జెండాను ఆవిష్కరించింది. సీఐటీయూ మండల కన్వీనర్ మోర్లె నాగేష్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జాడే మోరేశ్వర్ మాట్లాడుతూ, కార్మిక హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సీఐటీయూ గత 55 ఏళ్లుగా పోరాడుతోందని తెలిపారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ, కార్మిక చట్టాల అమలు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్