ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి

1చూసినవారు
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి
కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం సాధించాలని సూచించారు. వేతన సవరణ, కరువు భత్యం, పెండింగ్ బిల్లుల మంజూరుకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్