తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1న కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇరిగిరాల భాస్కర్ పిలుపునిచ్చారు. మంగళవారం కౌటాల మండల కేంద్రంలో విడుదల చేసిన ప్రకటనలో,
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజా ప్రతినిధులు, యువకులు ప్రతి గ్రామం నుంచి పెద్దఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.