*రేణుక ఎల్లమ్మ ఆలయ రహదారిపై మొరం మట్టి: పోలీసులకు ఫిర్యాదు

1చూసినవారు
*రేణుక ఎల్లమ్మ ఆలయ రహదారిపై మొరం మట్టి: పోలీసులకు ఫిర్యాదు
కాగజ్‌నగర్ పట్టణంలోని ఆర్ ఆర్‌ఓ కాలనీలో గల రేణుక ఎల్లమ్మ దేవాలయంకు వెళ్లే రహదారిపై కాంగ్రెస్ నాయకుడు లేండుగూరే శ్యామ్‌రావు ట్రాక్టర్ల ద్వారా మొరం మట్టి వేయించడంతో రహదారి మూసుకుపోయింది. దీంతో భక్తులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ చర్యలు అక్రమమని ఆరోపిస్తూ, ఆలయ కమిటీ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ సుధాకర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు రామ గౌడ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్