కాగజ్‌నగర్ మండలంలోని గన్నారం, మాండవ, ఆరెగూడ, అనుకోడ గ్రామాల్లో చెరువులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హరిత, అక్రమ మట్టి రవాణాపై కఠినంగా స్పందించారు. నజ్రుల్‌నగర్ విలేజ్ నెం. 12 పరిధిలో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సరైన అనుమతులు లేకుండా మట్టి లేదా ఇసుక తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, రవాణా చేపట్టే ముందు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తప్పనిసరిగా పొందాలని కలెక్టర్ హెచ్చరించారు.