కాగజ్‌నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీ, వార్డు నెంబర్–3లో నెలల తరబడి మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త తొలగించకపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపించి కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట భరించలేని దుర్వాసన, దోమల బెడదతో జ్వరాలు, చర్మవ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది.