కాగజ్‌నగర్ పట్టణం ద్వారకానగర్ లోని మురుగునీటి కాలువను కొంతమంది కబ్జాదారులు దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. దీంతో శుక్రవారం కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ ఎస్ అంజయ్యకు కాలనీవాసులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలాలను కబ్జా చేయడం వలన మురుగు నీరు నిలువ ఉండి దోమలు వృద్ధి చెంది వ్యాధులు వస్తున్నాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ ను కోరినట్లు తెలిపారు.