అన్నదాన సత్రంపై పిర్యాదులు రాజకీయ కుట్ర: కోనేరు కోనప్ప

1చూసినవారు
కాగజ్‌నగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పేదలకు అన్నదానం చేస్తున్న తమ సత్రంపై కక్షపూరితంగా ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం 800 గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చిందని, అదే స్థలంలో సత్రం నిర్వహిస్తున్నానని, 1600 గజాలు ఆక్రమించానన్న ఆరోపణలు తప్పుడువని ఖండించారు. లీజు పొడిగింపునకు వినతిపత్రాలు ఇచ్చినా నోటీసులు పంపడం రాజకీయ కుట్ర అని విమర్శించారు. వేసవిలో అంబలి పంపిణీ సహా సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్