సీఎం సభకు భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

0చూసినవారు
సీఎం సభకు భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పర్యటన నేపథ్యంలో, సిర్పూర్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదేశాల మేరకు కుకూడ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా సభకు హాజరవుతున్నట్లు నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్