కాగజ్‌నగర్ మున్సిపాలిటీ వార్డు నం. 9కు చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు యూసుఫ్ పార్టీ టికెట్ తనకు కేటాయించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన తనకు టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తికి కేటాయించడం నిరాశ కలిగించిందని, కార్యకర్తల్లోనూ అసంతృప్తి నెలకొందని తెలిపారు. పార్టీ పెద్దలు పునఃసమీక్షించి న్యాయం చేయాలని, లేదంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ప్రజల ఆశీర్వాదం పొందుతానని యూసుఫ్ స్పష్టం చేశారు.