కాగజ్‌నగర్ 21వ వార్డు
బీజేపీ కౌన్సిలర్ దూసరి కృష్ణవేణి వెంకటి గౌడ్ తమ రెండు నెలల వేతనమైన రూ. 9,100ను శ్రీ కృష్ణ గోశాలకు విరాళంగా అందజేశారు. వార్డు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాము గోవుల సంరక్షణ కోసం ఐదేళ్ల పదవీకాల వేతనాన్ని గోశాలకు అందజేయాలని నిర్ణయించుకున్నట్లు హిందూ జాగరణ్ మంచ్ జిల్లా అధ్యక్షుడు శివ గౌడ్ తెలిపారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించే వరకు హిందూ సమాజం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు ఉమేష్ జాజు, బంకట్ అసావా, అరుణ్ లోయా, విజయ్, అనిల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.