పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ సూరజ్

3చూసినవారు
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ సూరజ్
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కాగజ్‌నగర్‌ పట్టణం లోని 25వ వార్డు కౌన్సిలర్ దుర్గం సూరజ్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. "ప్రతి బిడ్డకు రెండు చుక్కలు – పోలియోకు శాశ్వత ముగింపు" అనే నినాదంతో తల్లిదండ్రులు తమ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్