ఉపాధి హామీ కూలీల సమస్యలపై సీపిఎం నాయకుల ఆగ్రహం

1చూసినవారు
ఉపాధి హామీ కూలీల సమస్యలపై సీపిఎం నాయకుల ఆగ్రహం
కాగజ్‌నగర్ మండలం సీతనగర్ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్, ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండించారు. ఎండలో పనిచేస్తున్న కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం అమానుషమని, గత సంవత్సరం చేసిన పనులకు కూలి డబ్బులు చెల్లించకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు విడుదల చేసి, పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్