ఎస్ఎస్ఏ, కేజీబీవి, యూఆర్ఎస్ ఆశ్రమ పాఠశాలల సిఆర్టిల న్యాయపరమైన డిమాండ్స్ పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ కొమురంభీం జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి డిమాండ్ చేశారు. శుక్రవారం కాగజ్‌నగర్ లో ఆమె మాట్లాడుతూ.. వివిధ గురుకులాలలో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్ టైం, అవుట్సోర్సింగ్, ఉపాధ్యాయులకు 12 నెలలుగా వేతనాలు చెల్లించలేదని, వారి ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.