బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తొలగింపును నిరసిస్తూ చింతలమానేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లాంచ్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ, గోలేం వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డా. ఆర్ఎస్పీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల కోసం సేవలందిస్తున్న డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు తగిన భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ, వెంటనే భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.