కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన తోగం పెంటు మృతి చెందడంతో, ఆయన అంత్యక్రియల కోసం కోనేరు కోనప్ప తరఫున కట్టెలు పంపిణీ చేశారు. కౌటాల పరిసర 40 గ్రామాల్లో దహన సంస్కారాలకు కట్టెల కొరత కారణంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది జూన్ 9 నుంచి ఇప్పటి వరకు 13 నెలల వ్యవధిలో మొత్తం 188 మంది దహన సంస్కారాలకు కోనేరు కోనప్ప తరఫున కట్టెలు అందజేసినట్లు వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమంతో అంతిమ సంస్కారాల నిర్వహణలో ఇబ్బందులు తగ్గాయని పేర్కొన్నారు.