కంటి ఆపరేషన్ కు మద్దతుగా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్

1చూసినవారు
కంటి ఆపరేషన్ కు మద్దతుగా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్
కాగజనగర్ లోని కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో శ్రీ కొత్తపల్లి వెంకటలక్ష్మి–చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఎంపికైన 11 మంది క్యాటరాక్ట్ రోగులకు సొసైటీ ఖర్చులతో రవాణా, భోజన సదుపాయం కల్పించి శనివారం బెల్లంపల్లి లయన్స్ కంటి ఆసుపత్రికి ఆపరేషన్ కోసం పంపించారు. గత 10 సంవత్సరాల్లో వేల మందికి కంటి ఆపరేషన్లు చేయించినట్లు డా. కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్