రేపు కౌటాలలో విద్యుత్ అదాలత్

1చూసినవారు
రేపు కౌటాలలో విద్యుత్ అదాలత్
కౌటాల సబ్‌స్టేషన్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కౌటాల, బెజ్జూరు, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్ మండలాల వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తు చేసుకొని సత్వర పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ఏఈ కౌటాల వినియోగదారులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.