పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం-సర్పంచ్ కోట వేణుగోపాల్

1చూసినవారు
సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, బారెగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని బారెగూడ, శివపూర్, పాకీజానగర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సర్పంచ్ కోట వేణుగోపాల్ సందర్శించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. పాఠశాల ఆవరణలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలలు పరిశుభ్రంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకోవడం గ్రామ పంచాయతీ బాధ్యత అని సర్పంచ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్