బెజ్జూరు: పత్తి పంటకు అధిక వర్షపాతం – జాగ్రత్తలు

55చూసినవారు
బెజ్జూరు: పత్తి పంటకు అధిక వర్షపాతం – జాగ్రత్తలు
బెజ్జూరు: అధిక వర్షాలు పడినప్పుడు పత్తి పంట ఎక్కువసేపు నీటిలో నిల్వ ఉండటం వల్ల ఆకులు ఎర్రగా మారి, మొక్క ఎదుగుదల తగ్గే ప్రమాదం ఉంది. మొక్కలు త్వరగా కోలుకోవడానికి 1 కిలో 19-19-19 ఎరువు, 600 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్, 20 గ్రాముల ప్లాంటమైసిన్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయాలి. ఈ మిశ్రమాన్ని 5 నుంచి 7 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయడం మంచిది.

సంబంధిత పోస్ట్