కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో సీఐ ప్రేమ్ కుమార్ నేతృత్వంలో డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు జరిగాయి. పోచమ్మ బస్తీ, న్యూ కాలనీలలోని కిరాణా, జనరల్ స్టోర్లలో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై ఆరా తీశారు. దుకాణదారులకు మత్తు పదార్థాలు విక్రయించరాదని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు.