కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం ఆధ్వర్యంలో శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అహర్నిశలు పాటు పడుతున్నారని, దీనిని సహించలేని వారే ఇలాంటి చవకబారు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇవి పునరావృతమైతే తాము చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.