విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి పెన్ను క్యాప్ మింగించిన తోటి విద్యార్థినులు

4464చూసినవారు
కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని దరిగాం రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిబాపులే (ఎంజేపీ) బాలికల గురుకుల విద్యాలయంలో పదో తరగతి విద్యార్థిని ఉషాన్ శృతిపై తోటి విద్యార్థినులు దాష్టీకానికి పాల్పడ్డారు. గత శనివారం రాత్రి, ఆమె కళ్లకు గంతలు కట్టి, కాళ్లు, చేతులు బిగించి, నోట్లో పెన్ను క్యాప్ వేసి నీళ్లు పోశారు. దీంతో క్యాప్ మింగేసిన విద్యార్థిని విషయాన్ని సిబ్బందికి చెప్పింది. తండ్రి రమేశ్ ఆదివారం ఉదయం వచ్చి, కుమార్తెను మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో కడుపులో క్యాప్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స చేసి బయటకు తీశారు. ఈ ఘటనపై తండ్రి సోమవారం కాగజ్‌నగర్ గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్