హోలి సందర్బంగా కోనప్పకు ఫారెస్ట్ సిబ్బంది శుభాకాంక్షలు

0చూసినవారు
హోలి సందర్బంగా కోనప్పకు ఫారెస్ట్ సిబ్బంది శుభాకాంక్షలు
హోలీ పండుగ సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కోనేరు కోనప్పను ఆయన స్వగృహంలో ఫారెస్ట్ డ్రైవర్లు, వాచర్లు కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోనప్ప గారు వారిని ఆప్యాయంగా ఆహ్వానించి రంగులతో శుభాకాంక్షలు తెలియజేశారు. అడవుల పరిరక్షణలో ఫారెస్ట్ సిబ్బంది చేస్తున్న కృషిని అభినందిస్తూ, సమాజ సేవ చేసే ప్రతి ఉద్యోగి గౌరవానికి పాత్రుడని పేర్కొన్నారు. హోలీ ఐకమత్యం, స్నేహభావానికి ప్రతీక అని, ఇలాంటి పర్వదినాలు సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. సమావేశంలో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్