మహిళల స్వయం ఉపాధికి అండగా ఉచితకుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

0చూసినవారు
మహిళల స్వయం ఉపాధికి అండగా ఉచితకుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
కాగజ్‌నగర్ పట్టణంలో మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి లక్ష్యంగా శ్రీ కొత్తపల్లి వెంకటలక్ష్మి–చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. సొసైటీ వ్యవస్థాపకులు డా. కొత్తపల్లి శ్రీనివాస్, డా. కొత్తపల్లి అనిత ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం ఉపాధి సాధించేందుకు ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రెండు నెలల పాటు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ సుజాత, ఆర్‌పీ మాధవి, ఇన్‌స్ట్రక్టర్ సవిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్