కాగజ్ నగర్ పట్టణంలోని బాలభారతి ఉన్నత పాఠశాలలో ప్రజాకవి, విప్లవ గాయకుడు గద్దర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్‌సిఎస్‌టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి చరణ్‌దాస్, మోక్షిత డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు డోంగ్రి సంతోష్, ఉద్యమ నిరుద్యోగ కళాకారుల జిల్లా అధ్యక్షులు మేడి కార్తిక్ మాట్లాడుతూ గద్దర్ కళను ఆయుధంగా మలచి అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారన్నారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. గద్దర్ ఆశయాలను ఆచరణలో పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.