పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల

0చూసినవారు
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల
కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, నేషనల్ గ్రీన్ కార్ప్స్, ఎకో క్లబ్, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. పర్యావరణ కాలుష్యం, దాని దుష్పరిణామాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ డా. లక్ష్మీ నరసింహం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ సైంటిస్ట్ భాస్కర్ రెడ్డి పర్యావరణ సంరక్షణ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.