కన్నెపల్లిలో వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ

0చూసినవారు
కన్నెపల్లిలో వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ
కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో మహిళా సంఘాల కోసం నిర్మించనున్న వీఓ భవనానికి భూమిపూజ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ మోర్లె పార్వతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య ముఖ్య అతిథిగా హాజరై పనులు ప్రారంభించారు. మహిళా సంఘాలు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ భవనం వారి సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోర్లె సమత, ఏపీఎం వినీష్ రావు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్