కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ కృష్ణ, సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెలలో కాగజ్ నగర్ నవోదయ పాఠశాలలో జరుగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రామయ్య, ప్రదీప్ భారతి, తదితరులు పాల్గొన్నారు.