సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు శనివారం మాట్లాడుతూ, కాగజ్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి యూఐడీఎఫ్ పథకం కింద రూ. 18.70 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రహదారులు, భవనాల శాఖలో 55 కిమీ రోడ్లు హ్యామ్ మోడల్ కింద, పంచాయతీరాజ్ శాఖలో 36 కిమీ రోడ్ల అభివృద్ధి చేపడుతున్నట్లు వెల్లడించారు. తలోడి– సలుగుపల్లి డబుల్ బీటీ రోడ్డుకు రూ. 25 కోట్లు, కాగజ్ నగర్ ఏరియా హాస్పిటల్‌లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ. 18.50 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.