బెజ్జూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం కోసం వ్యాపారులు, ప్రజలు సహకరిస్తే కృషి చేస్తామని ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో బస్సులు రోడ్లపైనే నిలుస్తున్నాయని, బస్టాండ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ కలిసి బస్టాండ్ నిర్మాణం కోసం తీర్మానం చేస్తే, వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపి పనులు ప్రారంభిస్తామని రాజశేఖర్ హామీ ఇచ్చారు.