బెజ్జూర్‌లో 66 మంది గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ

0చూసినవారు
సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు బుధవారం బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో 66 మంది గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేనిపక్షంలో మంజూరు పత్రాలు రద్దు చేసి ఇతరులకు కేటాయిస్తామని ఆయన హెచ్చరించారు. గిరిజనుల శాశ్వత నివాస అవసరాల కోసం ముఖ్యమంత్రి సహకారంతో 500 అదనపు ఇండ్లు మంజూరు చేయించామని, మండలంలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్