జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 3న హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు తిరుమల చారి, అబ్దుల్ జమీల్ తెలిపారు. సోమవారం కాగజ్‌నగర్‌లో కరపత్రాలు ఆవిష్కరిస్తూ, తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా జర్నలిస్టుల సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అక్రెడిటేషన్ పాలసీ ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయడం, ఆరోగ్య బీమా పథకం పునరుద్ధరణ, అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.