కాగజ్‌నగర్ పట్టణంలో ఏప్రిల్ 2న జరగనున్న శ్రీ వీర హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం డీఎస్పీ వహీదుద్దీన్, టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ యాత్ర రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమై వివిధ మార్గాల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకునే ఈ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ ఘటనలు నివారించడానికి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు పాల్గొన్నారు.