బలగలలో ఉపాధి పనులను పరిశీలించిన కాగజ్‌నగర్‌ ఎంపీడీవో

76చూసినవారు
బలగలలో ఉపాధి పనులను పరిశీలించిన కాగజ్‌నగర్‌ ఎంపీడీవో
కాగజ్‌నగర్‌ మండలంలోని బలగల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం ఎంపీడీవో కోట ప్రసాద్ పరిశీలించారు. అధికారులు చూపిన కొలతల ప్రకారం కందకాలు తవ్వాల్సిందిగా కూలీలకు సూచించారు. కూలీలకు పని ప్రదేశం వద్ద మంచినీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలని ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఈజీఎస్ ద్వారా నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్