పెంచికల్పేట్ మండలంలోని ఒడ్డుగూడ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం పెద్దవాగు ఒడ్డున పులి అడుగుజాడలను గమనించిన అటవీ అధికారులు దాని సంచారాన్ని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు గ్రామాల్లో డప్పు ప్రచారం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పంట పొలాలకు గుంపులుగా వెళ్లాలని, రాత్రి వేళల్లో తిరగవద్దని హెచ్చరికలు జారీ చేశారు.