బెజ్జూర్ ఎస్ఐ సర్తజ్ పాషాకు సమస్యలు వివరించిన నాయకులు

55చూసినవారు
బెజ్జూర్ ఎస్ఐ సర్తజ్ పాషాకు సమస్యలు వివరించిన నాయకులు
బెజ్జూర్ మండలానికి ఇటీవల బాధ్యతలు చేపట్టిన నూతన ఎస్ఐ సర్తజ్ పాషాను కోనేరు అభిమానులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐను శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్ఐతో మండల సమస్యలు, శాంతి భద్రతల మెరుగుదలపై చర్చించారు. ఎస్ఐకి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోనేరు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్