భూమాత రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితాను కాగజ్‌నగర్ మండలం భట్‌పల్లి గ్రామపంచాయతీ నోటీసుబోర్డుపై మంగళవారం అంటించామని గ్రామపంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఈ ప్రకటన ద్వారా లబ్ధిదారుల వివరాలను పబ్లిక్ చేశారు. జాబితాలో పొందుపర్చిన వివరాలపై ఎవరైనా అభ్యంతరాలు కలిగి ఉంటే వారు తహశీల్దార్ ఆఫీసును సంప్రదించాలని సూచించారు. దీంతో పారదర్శకత పెరుగుతోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.