ఆపన్న హస్తం కోసం నిరీక్షణలో చిన్నారి అనన్య

2చూసినవారు
ఆపన్న హస్తం కోసం నిరీక్షణలో చిన్నారి అనన్య
బెజ్జూర్ మండలానికి చెందిన ఆరెపల్లి నాగేష్ కుమార్తె అనన్య (2) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. పొట్టలో గడ్డలు ఏర్పడటంతో, స్థానిక వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనన్య వైద్య ఖర్చులు భరించడం దినసరి కూలీ అయిన నాగేష్ కుటుంబానికి భారంగా మారింది. దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. ఫోన్‌పే ద్వారా చిప్పకుర్తి సాయి (7989778862), జావిద్ అలీ ఖాన్ (6300005645) నంబర్లకు ఆర్థిక సహాయం అందించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్