సర్సిల్క్ వార్డు సభలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ బాబు

0చూసినవారు
కాగజ్‌నగర్ పట్టణంలోని సర్సిల్క్ వార్డు నం. 1లో జరిగిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక వార్డు సభలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా రెండు లక్షల పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం వార్డులో 18 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, ఈ ఏడాది కూడా అర్హులకు ఇళ్లు అందిస్తామని చెప్పారు. వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి యుఐడిఎఫ్ నిధులు వినియోగిస్తామని, డాడానగర్ చౌరస్తా నుంచి వివేకానంద సెంటర్ వరకు కొత్త సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.