బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలిసిన ఎమ్మెల్యే

0చూసినవారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలిసిన ఎమ్మెల్యే
తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్‌బాబు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి తిరుపతి లడ్డూను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నివసిస్తున్న ఆరె కులస్తులను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నడ్డా, త్వరలో ఢిల్లీలో ఈ అంశంపై సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు ఎమ్మెల్యే హరీష్‌బాబు వెల్లడించారు.