కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా వార్డు నం. 29లో డా. కొత్తపల్లి అనిత శ్రీనివాస్, వార్డు నం. 21లో శ్రీమతి దూసరి కృష్ణవేణి, వార్డు నం. 4 లో శ్రీమతి ఉడుత స్వరూప గార్ల నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి వారి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.