హైదరాబాద్‌లోని నాచారం హెచ్‌ఎంటీ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రధాని నరేంద్ర మోడీ దీర్ఘాయుష్షు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ పుష్కరకాలంగా దేశానికి నాయకత్వం వహిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ వేదికపై ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. 12 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న
మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని పేర్కొన్నారు.