దాహేగాం మండలం చిన్న రాస్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు. కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఆత్మ చైర్మన్ రామారావు కూడా హాజరయ్యారు. తెలంగాణ గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, గ్రామ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వరి, వార్డు సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.